జనసేన కోసం జబర్దస్త్ టీం

SMTV Desk 2019-04-04 18:25:18  janasena, Jabardasth

ఏపీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం అక్కడున్న మూడు ముఖ్య పార్టీలు నిరంతరం వారి వారి వ్యూహాలతో నిరంతరం శ్రమిస్తున్నారు.ఇదిలా ఉండగా ఒక్కో పార్టీ వారు ఒక్కో విధంగా వారి పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఓ పక్క వై ఎస్ జగన్ కోసం తన కుటుంబీకులు సహా పలువురు సినీ నటులు విస్తృతంగా ప్రచారం చేస్తుంటే మరో పక్క చంద్రబాబు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారు.ఇదిలా ఉండగా అవ్వడానికి సినీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం మెగా కాంపౌండ్ నుంచి నిహారికా మినహా ఇంకా ఎవ్వరూ ప్రచారానికి రాలేదు.

ఇదిలా ఉండగా పవన్ అంటే అభిమానం ఉన్న గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీమ్ పవన్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఇప్పుడు వీరి సరసన జనసేన పార్టీ గెలుపు కోసం మనకి ఎంత గానో వినోదాన్ని అందించే “జబర్దస్త్” టీమ్ కదిలింది.ఒక పక్క జనసేనాని గెలుపుతో సహా అదే పార్టీలో నర్సాపురం నుంచి ఎంపీ గా పోటీ చేస్తున్న వారి న్యాయ నిర్ణేత అయిన నాగబాబు గెలుపు కోసం జబర్దస్త్ టీమ్ లీడర్లు భీమవరం మరియు నర్సాపురంలో జనసేన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రతీ ఇంటికీ తిరిగి మ్యానిఫెస్టోను జనసేన సిద్ధాంతాలను వివరిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో హైపర్ ఆది,ఆటో రామ్ ప్రసాద్,చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ మరియు రాకింగ్ రాకేష్ లు పాల్గొన్నారు.