సమ౦తకు ట్రై చేసే వాడినేమో? : సాయిధరమ్ తేజ్

SMTV Desk 2017-08-15 14:10:20  sai daram tej, nakshatram movie, samantha, raviteja, prabas.

హైదరాబాద్, ఆగస్ట్ 15 : కృష్ణవంశీ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ "నక్షత్రం" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ లోని సీఆర్ క్వార్టర్స్ లో ఓ బెటాలియన్ తో సరదాగా ముచ్చటిస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని బెటాలియన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు హీరోయిన్ సమంత అంటే ఎంతో ఇష్టమని, తను చాలా బాగుంటుందని అన్నాడు. ఒకవేళ సమంత చైతూకి ఫిక్స్ కాకుండా ఉంటే తానూ ట్రై చేసే వాడిని కావొచ్చు అంటూ సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా, హీరోల విషయానికి వస్తే మామయ్య మెగాస్టార్ చిరంజీవి తర్వాత రవితేజ, ప్రభాస్ లు నచ్చుతారని తెలిపారు. రవితేజ ఎనర్జీ లెవెల్స్ బాగా ఇష్ట౦, ఒకవేళ తనతో కలిసి మల్టీ స్టారర్ చిత్రం చెయ్యాల్సి వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు. హీరోయిన్ రెజీనా గురించి ప్రస్తావిస్తూ.. నా మొదటి హీరోయిన్ రెజీనా, తెర మీద మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింద౦టూ చెప్పుకొచ్చారు.