బస్సులో పట్టుపడ్డ రూ.3.47 కోట్లు

SMTV Desk 2019-04-04 18:12:45  election commission officers, tamilnadu, police, illegal money, elections

ధర్మపురి జిల్లాలో ఒక బస్సులో దుండగులు వదిలిపెట్టిన రూ.3.47 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ఇంత పెద్ద మొత్తం ఉన్నట్టు గుర్తించిన కండక్టర్‌ ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. ఏడు సంచుల్లో ఉన్న రూ.3.47 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కండక్టర్‌ సెల్వరాజ్‌ నిజాయితీని అధికారులు అభినందించారు. ఆ నగదు తమదేనంటూ ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకే ఈ నగదును తరలిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.