వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “2.0”

SMTV Desk 2019-04-04 18:10:23  robo 2.o , super star Rajinikanth,

ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు శంకర్.భారీ బడ్జెట్ తో ఎన్నో విజువల్ వండర్స్ ను భారతదేశ వెండితెరకు శంకర్ పరిచయం చేసారు.అలా పరిచయం చేసిన ఒక భారీ విజువల్ ట్రీట్ “రోబో”.ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన “2.0” బుల్లితెర ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉందని ఆ సినిమాను ప్రసారం చెయ్యబోయే జీ తెలుగు ఛానెల్ వారు తెలియజేసారు.

ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినికాంత్ హీరో,యాంటీ హీరో పాత్రల్లో మెప్పించగా విలన్ గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించారు.మరో లేడీ రోబోగా అమీ జాక్సన్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ పోషించారు.శంకర్ ఈ సినిమాను దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో 3Dలో తెరకెక్కించారు.ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మొట్టమొదటిసారిగా 4D టెక్నాలజీ సంగీతాన్ని అందించారు.శంకర్ రజినీలా కాంబినేషన్ లో వచ్చిన ఈ విజువల్ వండర్ ను బుల్లితెరపై కూడా మిస్సవ్వకుండా చూడాలి అనుకుంటే ఏప్రిల్ 13 ఈ శనివారం సాయంత్రం మీ జీ తెలుగు ఛానెల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వస్తుంది చూడండి.