గిన్నిస్‌ రికార్డులోకి బ్రిటన్ యువరాజు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్

SMTV Desk 2019-04-04 18:09:29  Meghan Markle and Prince Harry join Instagram as Sussex Royal , Meghan Markle, Prince Harry, Instagram , Sussex Royal

బ్రిటన్ : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్‌ లే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. వారు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే పది లక్షల ఫాలోవర్స్‌ ను మైలురాయిని దాటారు. తక్కువ టైమ్‌ లో ఎక్కువ ఫాలోవర్స్‌ ను సాధించిన ఇన్‌ స్టాగ్రామ్‌ యూజర్‌గా వీరి ఖాతా గిన్నిస్‌ రికార్డుల కెక్కింది. మొదటి 5గంటల్లో పది లక్షలమంది ఫాలోవర్స్‌ ను నమోదు చేసింది. వారి ఇన్‌స్టగ్రామ్‌ ఖాతాలో ఇప్పటివరకు వారు చేసిన రెండు పోస్టులకే 3 మిలియన్‌ ఫాలోవర్స్‌ ను సాధించారు. వారు పెట్టిన రెండు పోస్టులకు వెల్‌ కమ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం 3.3 మిలియన్లతో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది