నష్టాల్లో ఇండియన్ స్టాక్ మర్కెట్స్

SMTV Desk 2019-04-04 17:18:20  Stack market, Sen sex, Shares

ముంబై : గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు లాభాలతోనే ప్రారంభం కాగా సెన్సెక్స్ తన మునపటి ముగింపు 38,877 పాయింట్లతో పోలిస్తే 59 పాయింట్ల లాభంతో 38,936 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 11,644 పాయింట్లతో పోలిస్తే 16 పాయింట్ల లాభంతో 11,660 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. అయితే సమయం గడిచేకొద్ది ఇండెక్స్‌‌లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10:32 సమయంలో సెన్సెక్స్ 65 పాయింట్ల నష్టంతో 38,812 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 11,626 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వె్స్టర్లు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇండియన్ రూపాయి గురువారం నష్టాల్లో ప్రారంభమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసల నష్టంతో 68.53 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. రూపాయి బుధవారం ముగింపు 68.42గా ఉంది.