ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు

SMTV Desk 2019-04-04 17:14:15  Shaktikanta Das, RBI, RBI interest rate decreses

న్యూఢిల్లీ : ఆర్‌బీఐకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భాగంగా గురువారం తొలి పాలసీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకు అనుగుణంగానే కీలక పాలసీ రేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో కదలాడుతుండటం, వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలు కీలక వడ్డీ రేట్ల తగ్గింపునకు ప్రధాన కారణం. ఆర్‌బీఐ రేటు కోత నేపథ్యంలో బ్యాంకులు, ఇతర నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లు (ఎన్‌బీఎఫ్‌సీలు) సమీప కాలంలో వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. అయితే ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ఇది వరుసగా రెండోసారి. కాగా శక్తికాంత్ దాస్ ఆర్‌బీఐ గవర్నర్‌గా పగ్గాలు చెప్పటిన దగ్గరి నుంచి ఇప్పటికీ రెండు సార్లు మానిటరీ పాలసీ కమిటీ సమావేశమైంది. రెపో రేటు 6 శాతానికి తగ్గడంతో రివర్స్ రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి దిగొచ్చింది. ఫిబ్రవరి పాలసీ సమీక్షలోనూ ఆర్‌బీఐ ఇదే విధంగా పావు శాతం మేర వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే.