మీ పేరేంటి?, అడ్రస్ ఏంటి? పీకకోస్త అంటూ బాలకృష్ణ వార్నింగ్

SMTV Desk 2019-04-04 16:59:45  Balakrishna, TDP,

నందమూరి బాలకృష్ణ మరోసారి కార్యకర్తలపై నోరు జారారు, హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో వేల నేజారిటీ వస్తుందన్న టీడీపీ కార్యకర్తపై విరుచుకుపడ్డారు, “నీ ఎంకమ్మా, వేలు ఏంట్రా వేలు, నీ బొంద వేల మెజారిటీ కాదు, ఇలాగేనే చెప్పది? నీ పేరేంట్రా చెప్పురా? నీ సంగతి చెబుతా, వేసి పడదొబ్బుతా” అంటూ ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యలు, చేష్టలతో విమర్శలను ఎదుర్కొంటూనే ప్రచారంలో ఉండే బాలయ్య, ఈ దఫా నియోజకవర్గంలో తనకు వచ్చే మెజారిటీ పై అభిమానులు చేసిన వ్యాఖ్యలతో అదుపు తప్పి మాట్లాడారు.

కార్యకర్తలపై బాలయ్య ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న రాత్రి హిందూపురం పరిధిలో రోడ్ షో నిర్వహిస్తున్న వేళ, “జై బాలయ్య” అని నినాదాలు చేస్తున్న అభిమానులు ఆయనకు 40 వేలు మెజారిటీ వస్తుందని, 60 వేలు మెజారిటీ వస్తుందని అంటుండటం ఈ వీడియోలో వినిపిస్తోంది. దీనిపై స్పందించిన బాలయ్య, “వేలు ఏంట్రా?” అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, తనదైన శైలిలో డైలాగులు కొట్టారు. మొత్తానికి మంగళగిరిలో బాబు పుత్రరత్నం లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో రోజూ నోరు జారుతూ వార్తల్లో నిలవటం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.