వ‌య‌నాడ్‌లో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నామినేష‌న్

SMTV Desk 2019-04-04 16:56:59  Rahul gandhi, vayanad

కేరళ : జాతీయ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ గురువారం వ‌య‌నాడ్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. యుపిలోని అమేథీతో పాటు వ‌య‌నాడ్‌లోనూ రాహుల్ లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్నారు. వ‌య‌నాడ్‌లోని క‌లెక్ట‌ర్ ఆఫీసులో రాహుల్ త‌న నామినేష‌న్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. నామినేష‌న్ దాఖలు అనంతరం వయనాడ్ లో రాహుల్ రోడ్ షో నిర్వహించారు. ఈనెల 23న వయనాడ్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాది కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు రాహుల్ వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.