మనవడికి బర్త్‌డే గిఫ్ట్‌గా స్విమ్మింగ్ పూల్ ఇచ్చిన అల్లు అరవింద్

SMTV Desk 2019-04-04 16:35:04  allu arvind,

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన మనవడిని బర్త్‌డే గిఫ్ట్‌తో ఆశ్చర్యపరిచారు. అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌కు పుట్టినరోజు కానుకగా ఒక స్విమ్మింగ్ పూల్‌ను ఇచ్చి తాత ప్రేమను చూపించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వెల్లడించి తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కుమారుడు అయాన్‌కు వాళ్ల తాత అల్లు అరవింద్ స్విమ్మింగ్ పూల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

45 రోజుల క్రితం స్విమ్మింగ్ పూల్ కావాలని అయాన్ వాళ్ల తాతను అడిగాడని చెప్పిన అర్జున్ తాము ఆ పూల్‌కు అల్లు పూల్ అని పేరు పెట్టుకున్నట్టు కూడా తెలిపాడు. మా ఇంట్లో ఈ తరం పిల్లల్ని చూస్తుంటే అసూయ కలుగుతుంది. ఇలాంటి తాత ఉండటం పిల్లల అదృష్టం అని అల్లు అర్జున్ కామెంట్ పెట్టారు.