54 వేల మంది ఉద్యోగుల పొట్టకొడుతున్న బీఎస్ఎన్ఎల్

SMTV Desk 2019-04-04 16:16:16  BSNL, JIO, BSNL Employees return home

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంస్థలో ప్రస్తుతం 1.76 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 54 వేల మంది ఉద్యోగులను తొలగించే ప్రతిపాదననను బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదించింది. దాంతోపాటు వ్యయాన్ని తగ్గించుకోడానికి పదవీ విరమణ వయసును కూడా 58 ఏళ్లకు కుదించాలని నిర్ణయించింది. సంస్థ మనుగడకు సంబంధించిన పది ప్రతిపాదనల్లో మూడింటిని బోర్డు ఆమోదించింది. నష్టాల కారణంగా బీఎస్ఎన్ఎస్ తన ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా చెల్లించకపోతోంది. జీతాల కోసం రూ.5 వేల కోట్ల అప్పు చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2900 కోట్లు రాలేదు. దీంతో ప్రభుత్వం రూ.3500 కోట్ల అప్పు మంజూరు చేసింది. ఈ డబ్బుతో మరో 4 నెలలు నెట్టుకొస్తామని, అయితే తర్వాత ఏం చేయాలో అర్థం కావడం లేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలు పూర్తవగానే ఉద్వాస ప్రతిపాదన అమల్లోకి వస్తుందని సమాచారం. జియోకి స్ప్రెక్ట్రమ్ కేటాయిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరసన తెలపడం విదితమే