అమ్మ కోరిక మేరకే ఈ ఆసుపత్రి : బాలకృష్ణ

SMTV Desk 2017-08-15 11:48:09  BALAKRISHNA, CANCER HOSPITAL, INDIPENDENCE DAY CELEBRATIONS.

హైదరాబాద్, ఆగస్ట్ 15 : ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... తన తల్లి కోరిక మేరకు ఈ కేన్సర్ ఆసుపత్రిని నిర్మించామని తెలిపారు. కేన్సర్ బాధితులకు తమ ఆసుపత్రి అందించిన ఎన్నో సేవలకు గాను బహుమతులు అందుకుందని, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. మహాత్మా గాంధీ గారు చేసిన సత్యాగ్రహ పోరాట విజయమే మనకు లభించిన ఈ స్వాతంత్ర్యం అని అన్నారు.