చరణ్‌కు గాయం....RRR షూటింగ్ వాయిదా

SMTV Desk 2019-04-03 18:24:51  rrr, ntr, ramacharan, rajamouli, shooting video viral

హైదరాబాద్ : దర్శక ధీరుడు రాజమౌళి ముల్టీ స్టారర్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తీస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఈ సినిమా షూటింగుకు అవాంతరం కలిగింది. పుణేలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోస చరణ్ జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేస్తుండగా అతనికి కాలు బెణికి మడమకు గాయమైంది. వైద్యులు అతణ్ని విశ్రాంతి తీసుకోమన్నారని, షూటింగును మూడువారాలపాటు వాయిదా వేస్తున్నామని మూవీ టీం ప్రకటించింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌ సరసన బాలీవుడ్ భామ లాలియా భట్, జూ.ఎన్టీఆర్ సరసన విదేశీ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ జట్టుకడుతున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.