నన్ను ఓడించేందుకే ఇదంతా!

SMTV Desk 2019-04-03 18:23:36  ap, elections, nara lokesh, ysrcp

అమరావతి : రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రచారంలో భాగంగా లోకేష్ మాట్లాడుతూ...వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ....నన్ను ఓడించేందుకు వైఎస్‌ఆర్‌సిపి అద్దెకు సినీ తారలను ప్రచారంలోకి దింపుతుందని ఆయన అన్నారు. ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడమే నిజమైన అభివృద్ధి అన్నారు. రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2024 నాటికి పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. మంగళగిరికి చెందిన తాడిబోయిన ఉమా యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆయన అనుచరులు టిడిపిలో చేరారు.