బిగ్ బ్యాటిల్ : CSK vs MI

SMTV Desk 2019-04-03 17:44:23  IPL 2019, csk, mi, sck vs mi

ముంబై : ఐపిఎల్‌లో సీజన్లో భాగంగా నేడు మరో అద్భుతమైన రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ సీజన్ ప్రారంభం నుండి చెన్నై సూపర్‌కింగ్స్‌ , ముంబై ఇండియన్స్ మాంచి ఫాంలో ఉన్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ వరుస విజయాలతో ముందుంది. ముంబై మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిపోయింది. ఈ రోజు రాత్రి 8 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా జరిగే చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ రోజు చెన్నైని అడ్డుకునేందుకు రోహిత్‌ ఏ వ్యూహాలను రచించాడో, అవి ఫలిస్తాయో లేదో వేచిచూడాల్సిందే.