పదో తరగతి విద్యార్ధులకు షీ టీమ్‌ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు

SMTV Desk 2019-04-03 17:03:41  she team, chevella division, ssc students

చేవెళ్ల : బుదవారం చేవెళ్ల డివిజన్‌లోని పదో తరగతి విద్యార్ధులకు షీ టీమ్‌ ఆధ్వర్యంలో ఒక అవగాహనా సదస్సు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈవ్‌టీజింగ్‌పై, సైబర్‌నేరాలపైన, స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలపైన విద్యార్దులకు అవగాహన కల్గించే విధంగా షీ టీమ్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం షాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని షాబాద్‌ ఆటో స్టాండ్‌ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి పదో తరగతి చదువుతున్న విద్యార్దినీ ,విద్యార్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.