స్వలింగ సంపర్కులను రాళ్ళతో కొట్టి చంపాలనే చట్టాన్ని అమలు చేసిన బ్రూనై

SMTV Desk 2019-04-03 17:00:42  brunei, Brunei implements stoning to death under new anti-LGBT laws, Same-sex couple

బ్రూనై : బ్రూనై దేశం తాజాగా మరో కొత్త చట్టాన్ని అమలు చేసింది. ఆ దేశంలోని స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని చట్టం చేసింది. బుధవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇస్లామిక్ చట్టాల్లో ఒకటిగా ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు. దొంగతనాలకు పాల్పడిన వారికి కూడా భారీ శిక్షను విధించాలని నిర్ణయించింది. ప్ర‌స్తుతం ఆగ్నేయాసియా దేశ‌మైన బ్రూనైలో సుల్తాన్ హ‌స‌న‌ల్ బోల్కియా పాల‌న కొన‌సాగుతోంది. ఇస్లామిక్ మ‌త నియ‌మాల‌ను దేశంలో బ‌లంగా అమ‌లు చేయాల‌ని ఇటీవ‌ల సుల్తాన్ హసనల్ ఆదేశాలు జారీ చేశారు. బ్రూనైలోని గే వ‌ర్గీయులు సుల్తాన్ ఆదేశాల ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి తోడుగా బ్రూనై దేశం తీరు ప‌ట్ల ప్ర‌పంచ‌దేశాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేస్తున్నాయి.