ఏపీ రైతులకు శుభవార్త

SMTV Desk 2019-04-03 16:56:49  andhrapradesh state government, tdp, chandrababu, ap formers, annadata shukheebhava scheme

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్త తెలిపింది. ఏపీ రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని ఈరోజు జమ చేసింది. ఇంతకముందే ప్రతి రైతు ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేసిన సర్కారు ఈరోజు మొదటి విడత మొత్తం మిగిలిన రూ.3 వేలు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది. దాదాపు 45 లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.1349.81 కోట్లు మేర ప్రభుత్వం నేడు జమ చేసింది.