ఇండియన్ మార్కెట్లోకి రానున్న హువావే పీ 30ప్రొ

SMTV Desk 2019-04-03 16:54:59  Huawei P30 Pro, Huawei , smartphone

ఎలెక్ట్రానిక్స్ తయారీ సంస్థ హువావే తన నూతన స్మార్ట్ ఫోన్ ను త్వరలో ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉంది. పీ 30ప్రొ అనే పేరుతో వస్తున్న ఈ ఫోన్‌ విక్రయాలను అమెజాన్‌లో విక్రయించనున్నారు. ఇంకా దీని ధరను వెల్లడించలేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. 6.47 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2340 ల 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128/562/512 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌.