టిడిపికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్

SMTV Desk 2019-04-03 16:53:57  RGV, ram Gopal Varma, jr ntr,

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లాంటి సంచలన సినిమా తీసి నిత్య వివాదాల్లో నిలిచిన ఆర్జివి ఒక్క ఏపిలో తప్ప అంతటా సినిమ రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న ఆర్జివి తన కామెంట్స్ తో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. లేటెస్ట్ గా టిడిపి అసలైన వారసుడు జూనియర్ ఎన్.టి.ఆర్ అని.. లోకేష్ కాదని ట్వీట్ చేశారు. అంతేకాదు నిజమైన సీనియర్ ఎన్.టి.ఆర్, జూనియర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ చూశాకే ఓటు వేయాలని అన్నారు.

భవిష్యత్తులో జూనియర్ ఎన్.టి.ఆర్ కే టిడిపి పగ్గాలు అందుతాయని.. టిడిపి అసలైన వారసుడు ఎన్.టి.ఆర్ మాత్రమే అని వర్మ అంటున్నారు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తర్వాత ఆర్జివి శశికళ సినిమా చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను ఏపిలో రిలీజ్ చేయకుండా అడ్డుపడినా సినిమా ప్రభావం తప్పకుండా ఏపి ఎన్నికల మీద ఉంటుందని అంటున్నారు. టిడిపికి అసలు వారసుడు ఎన్.టి.ఆర్ అన్న వార్తలకు జూనియర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.