ప్రైవేట్ హాస్టల్ లో రూ.70 లక్షలు పట్టివేత

SMTV Desk 2019-04-03 15:15:26  elections, illegal money, cheerala, prakasham district

చీరాల : ఎన్నికల సందర్భంగా పోలీసులకు ప్రకాశం జిల్లా వేటపాలెం మండం ప్రసాద్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ లో రూ.70 లక్షల నగదు లభ్యమైంది. బుదవారం ఉదయం పక్కా సమాచారంతో చేపట్టిన తనీఖీలో హాస్టల్ లోని బీరువాలో ఉన్న రూ.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్నికలు వస్తున్న సందర్భంగా వసతి గృహంలో డబ్బు ఎవరు దాచి ఉంచారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ తనిఖీల్లో చీరాల గ్రామీణ సీఐ బి.ప్రసాద్‌, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పాల్గొన్నారు.