అంచనాలను మించిన స్థిరాస్తి లావాదేవీలు

SMTV Desk 2019-04-03 15:12:39  Sub Registration Stamps, Sub Registration, stamps, bonds, registrations

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా స్థిరాస్తి లావాదేవీలు అంచనాలను మించాయి. ఒకేసారి ఊహించని విధంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 కల్లా రియల్ ఆదాయంలో అత్యధిక వృద్ధిరేటును సాధించింది. మార్చి నెలలో ఏకంగా లక్షా 52 వేల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీని ప్రభావం వల్ల 7వందల 50 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది ఆరంభం నుంచే స్థిరాస్తి లావాదేవీలు జోరందుకున్నాయి. అటు రిజిస్ట్రేషన్లు పెరుగుతూ వచ్చాయి. 2017-18లో 11 లక్షల 34వేల 669 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో ఖజానాకు 4 వేల 497 కోట్ల రుపాయలతో పాటు నాన్- రిజిస్ట్రేషన్ రెవెన్యూ ద్వారా మరో 5 వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కాగా మొత్తం రూ.5 వేల 500 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.