2 పండగలకు 2 సిలిండర్లు

SMTV Desk 2019-04-03 15:08:16  tdp,

సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టోపై టీడీపీ కసరత్తు చేస్తోంది. 2 పండగలకు 2 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైతే పండగలన్నింటికీ సిలిండర్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంతకుముందే ప్రకటించారు. సాగుకు 12 గంటల కరెంట్‌, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వాలనే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇంటర్‌ విద్యార్థులకు భృతి.. సీపీఎస్‌ రద్దుకు చర్యలు, ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం, పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే ప్రతిపాదనను టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరుచనున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలులో టీడీపీ దూసుకుపోతోంది. రైతులకు రుణమాఫీ, మహిళలకు పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ క్యాంటీన్ వంటి పథకాలు ప్రజలలోకి దూసుకుపోయాయి.