‘పీఎం నరేంద్ర మోడీ' సినిమాపై ఈసీ సంచలన నిర్ణయం

SMTV Desk 2019-04-03 15:02:34  PM Narendra Modi, biopic,

ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. దేశ్ భక్తి యే మేరా శక్తి అనేది క్యాప్షన్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్..నరేంద్రమోడీ పాత్రలో నటించారు. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు ముందుగా ప్రకటించారు.సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్ తొమ్మిది డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు.ఒక చాయ్ వాలా నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆపై దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన మంత్రి జీవితచరిత్రపై తెరకెక్కిన ఈ సినిమా ఓటర్ల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఈ సినిమా విడుదలను ఆపు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసారు.

దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఈ సినిమా విడుదల ఆపుచేయడంలో మాకు ఎలాంటి అధికారం లేదు. ఈ ఈ సినిమా విడుదలపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర సెన్సార్ బోర్డ్ నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్టు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని బాంబే హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. దానికి బాంబే కోర్టు ఈ సినిమా రిలీజ్ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించాలని తీర్పునిచ్చింది. మొత్తానికి లోక్‌సభకు మొదటి విడత ఎన్నికలకు ఒక వారం రోజులు ముందు రిలీజవుతున్న ఈ సినిమా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.