నాగార్జున పైన 'ఎఫ్ 2' ప్రభావం

SMTV Desk 2019-04-03 13:16:33  f2, nagarjuna,

అక్కినేని నాగార్జున కెరీర్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు2 ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్య నాగార్జునకు పెద్దగా హిట్ సినిమాలు లేకపోవటంతో మన్మధుడు సినిమా విషయంలో నాగార్జున తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. రాహుల్ ఈ సినిమా కోసం రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేయగా వాటిని వద్దని వారించారట నాగార్జున. మన్మధుడు సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కూడా లేదని, మొత్తం కామెడీ సీన్లే సినిమాకు ప్లస్ అయ్యాయని, ఇందులో కూడా మొత్తం కామెడీకి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారట.

వాస్తవానికి ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది, మునుపటిలాగా యాక్షన్ సినిమాలకు కాకుండా కామెడీ ఎక్కువున్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ట్రెండ్ గమనించిన నాగార్జున యాక్షన్ సీన్స్ వద్దని, సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుకునే విదంగానే సినిమా ఉండాలని అన్నారట. మొత్తానికి ఫ్లాపులతో సతమతమైన నాగార్జున మన్మధుడు సినిమా విషయంలో మళ్లీ అవే తప్పులు రిపీట్ అవకుండా జాగ్రత్త పడుతున్నాడన్నమాట. నాగార్జున ఈ నిర్ణయం వెనక “ఎఫ్2” సినిమా ప్రభావం కూడా ఉండుంటుందని టాక్ వినిపిస్తుంది.