ఎన్నికలు వస్తే గెలివాల్సింది పార్టీలు కాదు!

SMTV Desk 2019-04-02 19:20:08  kcr, trs, loksabha elections

వరంగల్ : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జయశంకర్ సార్ విగ్రహానికి కెసిఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ...వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా అని, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వరంగల్ జిల్లా అని కొనియాడారు. అంతేకాక వరంగల్ జిల్లా విద్యుత్ తలసరి ఆదాయంలో ప్రధమ స్థానంలో ఉందన్నారు. దేశంలో 70 వేల టిఎంసిల నీళ్లు ఉన్నాకూడా… దేశం చీకట్లో ఉండటానికి కారణం బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలేనని కెసిఆర్ మండిపడ్డారు. వచ్చె నెల నుంచి పెన్షన్లు రెట్టింపు చేస్తామని కెసిఆర్ వెల్లడించారు. ఇకపై కాకతీయ కాలువలో నీళ్లు ఉండవని ప్రసక్తే ఉండదన్నారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్, బిజెపిలేనని ఇప్పుడేమో నోరు పారేసుకుంటు ఒకరి ఒకరు నిందలు వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజెపిలు లేని కూటమి కేంద్రంలో రావాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తే గెలివాల్సింది పార్టీలు కాదని… ప్రజల అభిమతం గెలువాలన్నారు. ఢిల్లీ మనల్ని సాదడం లేదని… ఢిల్లీనే మనం పోషిస్తున్నామని కెసిఆర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలంటే ప్రాంతీయ పార్టీల పెత్తనం ఢిల్లీలో ఉండాలన్నారు. పసునూరి దయాకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆదాయపు పన్ను, జిఎస్ టి కలిపి ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి లక్ష కోట్లు ఇస్తున్నామని, ఢిల్లీ మాత్రం మనకు 25 వేల కోట్ల రూపాయలు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.