హరికృష్ణ మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్, చివరకు సుహాసినిని కూడా...

SMTV Desk 2019-04-02 18:26:07  mohan babu, Ap cm

ఇటీవల వైసీపీలో చేరిన ప్రముఖ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదని. పార్టీ అధ్యక్షుడు మహనీయుడు ఎన్టీఆర్ సభ్యత్వాన్ని తొలగించిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఎలాంటివారినైనా బాబు వాడుకొని కరివేపాకులా తీసి అవతల పడేస్తాడని అని అన్నారు, హరికృష్ణ మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్, చివరకు సుహాసినిని కూడా నాశనం చేసాడని అన్నారు.