బెల్లం బాబుతో ‘బుల్‌రెడ్డి’ అంటూ స్టెప్పులేయనున్న పాయల్

SMTV Desk 2019-04-02 18:24:01  bellamkonda srinivas, kajal, payal rajput, seetha, bullressy item song, kavacham, alludu seenu, rx 100

హైదరాబాద్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా సీత. ఈ సినిమాలో శ్రీనివాస్ మరోసారి కాజల్ తో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బెల్లం బాబు ఐటం సాంగ్‌తో రచ్చ చేయబోతున్నాడు. ఈ ఐటెం సాంగ్ లో పాయల్ రాజ్‌పుత్ సందడి చేయనుంది. ‘బుల్‌రెడ్డి..’ అని సాగే ఈ పాటను బుధవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.‘ఆర్ఎక్స్ 100’ సినిమా టాలీవుడ్ లో ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన పాయల్ రాజ్ పుత్ కు అవకాశాలు వచ్చినా ఆచితూచి అడుగులు వేయడం నేర్చుకుంది. ఏ సినిమా చేస్తే ఎలాంటి విజయం వస్తుందో అని అలోచించి మూవీస్ సెలక్ట్ చేసుకుంటోంది పాయల్.‘ఎఫ్ 2’ తరువాత వెంకటేష్ చేస్తున్న వెంకిమామ సినిమాలో పాయల్ నటిస్తుంది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సీత సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నటించేందుకు ఒకే చెప్పింది. ఈ సాంగ్ షూటింగ్ కు సంబంధించిన ఓ స్టిల్‌ను రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. జిగేల్ అనిపించే డ్రెస్ లో ఆర్ఎక్స్ 100 బైక్ పై వస్తున్న ఆమె ఫొటో యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.