‘ఆర్ఆర్ఆర్’ ‘బ్రదర్స్ లవ్’ వీడియో వైరల్

SMTV Desk 2019-04-02 18:22:39  rrr, ntr, ramacharan, rajamouli, shooting video viral

హైదరాబాద్ : దర్శక ధీరుడు రాజమౌళి ముల్టీ స్టారర్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తీస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో తాజాగా హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ కార్వాన్ నుంచి దిగుతుండగా.. అతడి కోసం స్కూటర్‌తో కింద వెయిట్ చేస్తున్నాడు రామ్ చరణ్. తరువాత ఈ ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దానిని ఇరువురి అభిమానులు షేర్ చేస్తూ.. ‘బ్రదర్స్ లవ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇందులో ఎన్టీఆర్ ‘కొమరం భీం’, రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలలో నటిస్తుండగా.. వారి సరసన డైసీ ఎడ్గర్ జోన్స్, అలియా భట్ రొమాన్స్ చేయనున్నారు. అలాగే అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షుకల ముందుకు రానుంది. ‘బాహుబలి’ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాదు అన్ని ఇండస్ట్రీలలోనూ మంచి అంచనాలు ఉన్నాయి.