ఇంజినీరింగ్ బీఈ/బీటెక్ స్టూడెంట్స్ కి శుభవార్త

SMTV Desk 2019-04-02 16:09:12  Jobs,

హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. విభాగాల వారీగా ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాల కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి ఇంజినీరింగ్ బీఈ/బీటెక్ లేదా డిప్లొమాని అర్హతగా నిర్ణయించారు. విద్యార్హత మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టులకోసం ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు : 60
పోస్టులు -ఖాళీలు : గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 40

ఇందులో విభాగాల వారీగా.. మెటలర్జీ -10, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 10, మెకానికల్ 10, ఇన్‌స్ట్రుమెంటేషన్ 5, సివిల్ 5
డిప్లొమా అప్రెంటీస్: 20
విభాగాల వారీగా..డిప్లొమా ఇంజినీరింగ్ అప్రెంటీస్ -20

విభాగాల వారిగా : మెటలర్జి 5, ఎలక్ట్రికల్ 5, మెకానికల్ 5, ఇన్‌స్ట్రుమెంటేషన్ 2, సివిల్ 3

అర్హత : సంబంధిత బ్రాంచులల్లో బీఈ/బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత

ఎంపిక : అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
వేదిక : ఆడిటోరియం బిల్డింగ్, మిధాని సీపీఎస్ ఆఫీస్(డీఎంఆర్ఎల్ దగ్గర), హైదరాబాద్.
వెబ్ సైట్ : www.midhani-india.in
ఎలా దరఖాస్తు చేయాలంటే : అప్లై చేయాలనుకున్నవారు. మొదటగా వెబ్‌సైట్‌కి లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో యూనిక్ రిజస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి అవసరమైన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేదీ : ఏప్రిల్ 13, 2019