కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల...సంపద సృష్టిస్తాం…సంక్షేమానికి పెద్ద పీట వేస్తాం!

SMTV Desk 2019-04-02 16:04:14  congress party, loksabha elections, rahul gandhi, manmohan singh, sonia gandhi, congress party election manifesto

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు చిదంబరం, ఏకే ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా రాహుల్ మాట్లాడుతూ...కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది దేశ అభివృద్ధికి పెద్ద ముందడుగు అన్నారు. మేనిఫెస్టో తయారీ ప్రక్రియను ఏడాది క్రితం మొదలుపెట్టామని, ప్రజల ఆకాంక్షలు మేనిఫెస్టోలో ఉండాలని చిదంబరానికి చెప్పినట్లు తెలిపారు. మేనిఫెస్టో వాస్తవాలకు దగ్గరగా ఉండాలనీ, అబద్ధాలు ఉండకూడదని చెప్పానన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం… సంపద సృష్టిస్తాం… సంక్షేమానికి పెద్ద పీట వేస్తాం… అన్న నినాదంతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు.

మేనిఫెస్టో ప్రధానాంశాలు :
* ప్రతి పేదవారి బ్యాంక్ అకౌంట్లో కనీస ఆదాయ పథకం కింద ఏడాదికి రూ.72 వేలు జమచేస్తామని తెలిపారు. తద్వారా ఐదేళ్లలో లబ్దిదారుల అకౌంట్లోకి రూ.3.60 లక్షలు జమఅవుతాయన్నారు.
* ఉపాధి హామీ పథకం 100 రోజుల నుంచి 150 రోజులకు పెంపు.
* రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్. రైతులు రుణాలు తిరిగి చెల్లించలేకపోతే క్రిమినల్ కేసులు ఉండవు.
* 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన. గ్రామ పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలు.
* విద్య కోసం బడ్జెట్ లో 6 శాతం నిధులు కేటాయింపు.