హార్దిక్‌ పటేల్‌కు సుప్రీం షాక్

SMTV Desk 2019-04-02 15:51:53  Hardik patel, supreme court,

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ నాయకుడు హార్దిక్‌ పటేల్‌కు సుప్రీం షాక్ ఇచ్చింది. విసనగర్ అల్లర్ల కేసులో హార్దిక్ దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఇందులో తనను దోషిగా పేర్కొనడంపై స్టే ఇవ్వాలని కోరుతూ హార్దిక్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై అర్జెంట్‌గా విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపించట్లేదు.

కాగా గుజరాత్‌లోని జమనగర్ నుంచి కాంగ్రెస్ తరపున లోక్‌సభ బరిలో ఉన్నారు హార్దిక్. దీనికి సంబంధించిన నామినేషన్ ఏప్రిల్ 4లోగా దాఖలు చేయాల్సి ఉంది. నామినేషన్‌కు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండటం, తనను దోషిగా పేర్కొనడంపై సుప్రీం ఇంకా స్టే విధించకపోవడంతో హార్దిక్‌కు గట్టి షాక్ తగిలినట్లైంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.