ఢిల్లీలో మ‌రో నిర్భయ ఘటన!!

SMTV Desk 2017-08-14 16:17:17  DELHI, SEXUAL ATEMPT, BUILDING, YOUNGSTER

ఢిల్లీ, ఆగస్ట్ 14 : దేశ రాజధాని ఢిల్లీ వివాదాలకు మారు పేరుగా తయారయ్యింది. తాజాగా ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. 22 ఏళ్ళ ఓ యువకుడు 20 ఏళ్ళ యువతిపై అత్యాచార౦ చేయబోయాడు. దానికి ఆ యువతి నిరాకరించడంతో ఆమెను నాలుగో అంతస్తు నుంచి తోసేసాడు. ఆ బాధితురాలు ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో అసిస్టెంట్ చెఫ్‌గా ప‌నిచేస్తున్నట్లు సమాచారం. భవనం మీద నుండి పడేటప్పుడు ఆ యువతి ఒంటిపై వస్త్రాలు సరిగా లేవని, భవనం లోపలి నుండి ఒక వ్యక్తి పారిపోవడం చూసినట్లు స్థానికులు తెలియజేశారు. ఆ యువతి తన స్నేహితురాలు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు నిందితుడితో కలిసి వచ్చినట్లు తన స్నేహితురాలు తెలియజేసింది. కాగా నిందితుడిని అరెస్ట్ చేసి, అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.