ఏప్రిల్ 20న వరల్డ్ కప్ జట్టు ప్రకటన!

SMTV Desk 2019-04-01 20:38:16  icc world cup 2019, icc, team india, msk, virat kohli, rohit sharma, shikar dhawan, ms dhoni

ముంబై : ఐపీఎల్ 2019 సీజన్ అనంతరం క్రికెట్ అభిమానులకు మళ్ళీ కనులవిందు చేసేందుకు ఐసీసీ వరల్డ్ కప్ వేచి ఉంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ జరుగుతుండగానే ప్రపంచ కప్‌లో తలపడే భారత జట్టు గురించి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించాడు. మే 30 నుంచి ఆరంభం కానున్న ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌గా దక్షిణాఫ్రికాపై జూన్ 5న ఆడనుంది.టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇదివరకే వరల్డ్ కప్ కు ఐపీఎల్ ప్రదర్శనకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలో ఏప్రిల్ 20న ప్రపంచ కప్ టోర్నీలో తలపడనున్న 15 మంది ప్లేయర్ల వివరాలను ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెస్కే.. ప్రస్తుతమున్న ఫామ్‌ను బట్టి చూస్తే.. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ టాప్ 3 బ్యాట్స్‌మెన్‌గా స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన ప్లేయర్లుగా ఎంఎస్ ధోనీ, కేదర్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులో స్థానం ఖాయం చేసుకున్నట్లే. కానీ, ఇంకా నెం.4లో బ్యాటింగ్‌కు దిగే ప్లేయర్ ఎవరనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. దాంతో పాటు మూడో స్పిన్నర్ కోసమూ భారత జట్టు వెదుకుతోంది.