తెలంగాణను బిజెపి చిన్నచూపు చూసింది!

SMTV Desk 2019-04-01 20:36:57  Harish rao, TRS Party,Telangana Parliament elections , bjp, sunita lakshmareddy

హైదరాబాద్‌ : మాజీ మంత్రి, టిఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు నేడు సునితా లక్ష్మారెడ్డి పార్టీలోకి చేరిక సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉండేది టిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు నాయకత్వంపై విశ్వాసం పోయింది. అందుకే రోజుకో కాంగ్రెస్‌ నేత టిఆర్‌ఎస్‌ లో చేరుతున్నారు, తెలంగాణ అన్ని రంగాల్లో అద్శంగా నిలిచింది అని అన్నారు. గతంలో బెంగాల్‌ గుజరాత్‌ రాష్ట్రాల గురించి చేప్పుకునే వారు ఇప్పుడు దేశ ప్రజలు తెలంగాణ మోడల్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు పట్టించుకువడం లేదు మిషన్‌ కాకతీయ,మిషన్‌ భగీరథ , రైతుభందు , రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. దేశంలోనే కెసిఆర్‌ నేంబర్‌ 1 అని ఆయన తెలిపారు. తెలంగాణను బిజెపి చిన్నచూపు చూసింది. కెంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా కోసం 16 ఎంపీ స్థానాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు సాధించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ,బిజెపి 103 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది.