కూతురు అనుమస్పద మృతి...అల్లుడు అంగం పెద్దగా ఉండడం వల్లే అని ఫిర్యాదు చేసిన మామ

SMTV Desk 2019-04-01 20:36:05  indonesia, wife and husband, uncle case on nephew, nephew penis is big, daughter died because nephew penis size big

ఇండోనేషియా : ఇండోనేషియాలోని ఈస్ట్ జావా నగరంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. తన కూతురు చనిపోవడంతో అల్లునిపై ఊహించని విధంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అల్లుడు అంగం చాలా పెద్దదిగా ఉంది, అందుకే తన కూతురు మరణించింది అని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల ప్రకారం...మారోన్ కిదుల్ గ్రామానికి చెందిన నెది సిటో ఉదయం చూసేసరికి తన కూమార్తె జుముంత్రి (23) బెడ్‌పై అనుమానస్పద స్థితిలో చనిపోయింది. కూతురు విగతజీవిగా పడివున్న తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శృంగారం చేస్తున్న సమయంలో తన అల్లుడు బర్సాహ్ అంగం పెద్దది కావడం వల్ల ఆమె నొప్పిని భరించలేక మరణించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత తేరుకుని జుముంత్రి భర్తను స్టేషన్‌కు పిలిపించి.. అంగాన్ని చూపించాలని కోరారు. సాక్ష్యం కోసం నెది సిటోతోపాటు అతని బంధువులు, గ్రామస్థులకు కూడా ఈ దృశ్యాన్ని చూపించారు. అయితే, అతడి అంగం సాధారణ సైజులోనే ఉందని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జముంత్రికి మూర్ఛ రావడం వల్లే చనిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు 14 ఏళ్ల వయస్సు నుంచే మూర్ఛవ్యాధి ఉందని, అందువల్లే ఆమె చనిపోయి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఇందులో అల్లుడు తప్పు ఏమీ లేదని మామ నెదికి తెలిపారు. దీంతో నెది కూడా తన కూతురుకి మూర్ఛ వ్యాధి ఉందని ఒప్పుకున్నాడు. అలాగే అల్లుడు బర్సాహ్‌కు క్షమాపణలు చెప్పాడు.