ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎక్కడో తెలుసా?

SMTV Desk 2017-08-14 15:43:40  INDIPENDENCE DAY, TIRUPATHI, CHANDRABABU NAYUDU, TARAKARAMA STADIUM

తిరుపతి, ఆగస్ట్ 14 : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అత్యంత సుందరంగా ముస్తాబైంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని తారకరామ స్టేడియంలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇందుకు గాను తిరుపతి నగర వ్యాప్తంగా కట్టు దిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు జిల్లా అధికారులు. భద్రతా కోసం 250 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. స్టేడియంలో 25 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అంతే కాకుండా, ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచుతూ సైదా బలగాలతో చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, వాహానాల రాకపోకలపై నిరంతరం నిఘా ఉంచారు. దాదాపు 5,580 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ లో పాస్ లను కూడా అందుబాటులో ఉంచారు. వివిధ శాఖల పని తీరును తెలియచేసేలా 12 శకటాల్ని తయారు చేసారు. ఈ వేడుకలో పాల్గొంటున్న ఏపీ సీఏం చంద్రబాబు రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటి౦చనున్నారు. అంతేకాకుండా పట్టణంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మొత్తానికి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.