పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా!

SMTV Desk 2019-04-01 18:23:19  ysrcp, ys jagan, ys sharmila, loksabha elections, assembly elections, tdp, chandrababu

గుంటూరు : వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్‌ షర్మిల ఎన్నికల సందర్భంగా గుంటూరులోని పొన్నూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాట తప్పారని షర్మిల విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్‌ఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేశారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు వైఎస్‌ఆర్ మేలు చేశారు. అమరావతిని అమెరికా, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తానని చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా.. పిల్లిపిల్లే.. పులిపులే. సింహం సింగిల్‌గానే వస్తుంది.. జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి అని షర్మిల అన్నారు.