రాబర్డ్‌ వద్రాకు సీబీఐ కోర్టు ఊరట

SMTV Desk 2019-04-01 18:21:58  Money laundering Case, Robert Vadra, Delhi court, anticipatory bail petition of Robert Vadra,

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రదానధ్యక్షురాలి భర్త రాబర్డ్‌ వద్రాకు మనీల్యాండరింగ్‌ కేసులో స్పెషల్‌ సీబీఐ కోర్టు ఊరటనిచ్చింది. రాబర్డ్‌ వద్రాకు, అతని సన్నిహితుడు మనోజ్‌ ఆరోరాకు ముందస్తు బెయిల్‌ మంజూర్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ కేసులో ఇద్ద‌రూ మ‌ధ్యంత‌ర బెయిల్‌పై ఉన్నారు. ముంద‌స్తు బెయిల్ కోసం ఇద్ద‌రూ 5 ల‌క్ష‌ల ప‌ర్స‌న‌ల్ బాండ్ల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అనుమ‌తి లేకుండా వ‌ద్రా దేశం విడిచి వెళ్ల‌రాదు అని కోర్టు స్ప‌ష్టం చేసింది. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ల‌భించ‌డం ఒక‌ర‌కంగా వ‌ద్రాకు పెద్ద ఊర‌టే. ట్ర‌య‌ల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ఈడీ స‌వాల్ చేయ‌నున్న‌ది. న్యాయ‌వ్య‌వ‌స్థ విజ‌యం సాధించింద‌ని వ‌ద్రా త‌ర‌పున వాదించిన అభిషేక్ మ‌ను సంఘ్వి తెలిపారు.