తాను ప్రధాని మంత్రి రేసులో లేనని స్పష్టం చేసిన ములాయం సింగ్

SMTV Desk 2019-04-01 18:21:06  sp, bsp, loksabha elections, mulayam singh yadav, prime minister, congress party, bjp

లక్నో : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎస్‌పి సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ సోమవారం మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ములాయం నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ తరుఫున ఎవరూ ప్రధాని రేసులు ఉన్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగానే… తాను ప్రధాని మంత్రి రేసులో లేనని స్పష్టం చేశారు. మెయిన్‌పురి నుంచి ఒక్క బిజెపి మాత్రమే నామినేషన్ వేయనుంది. ఇప్పటికే కాంగ్రెస్ తో సహా పలు ప్రాంతీయ పార్టీలు మెయిన్ పురి అభ్యర్థిని నిలబెట్టడం లేదని ప్రకటించాయి. బిజెపి ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. మెయిన్‌పురిలో బిజెపి ఇప్పటివరకు విజయం సాధించలేదు. 1996 నుంచి మెయిన్‌పురిలో ఎస్‌పి ఎనిమిది సార్లు గెలుపొందింది. ములాయం పూర్వీకుల గ్రామం ఇదే నియోజకవర్గంలో ఉండటంతో ములాయం ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. మెయిన్‌పురిలోని ప్రజలు ములాయంను ఇప్పటికి ముఖ్యమంత్రి అని పిలుస్తుండటం విశేషం.