ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను వశం చేసుకున్న టీమిండియా

SMTV Desk 2019-04-01 16:54:13  icc test championship, team india, india, australia, virat kohli

దుబాయ్‌ : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వరుసగా మూడో సారి అగ్రస్థానంలో నిలిచింది. ఆసిస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో క్లీన్స్వీప్ చేసిన టీంఇండియా ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 116 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి వరుసగా మూడో ఏడాది మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. తర్వాతి స్థానాన్ని న్యూజిలాండ్‌ దక్కించుకుంది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. మరోసారి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ మన జట్టు చక్కని ప్రదర్శన చేస్తోంది. అయితే, టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం కాస్త ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్‌ ప్రాముఖ్యత మనకు తెలుసు. బాగా రాణించిన వారే ముందుకు వెళ్తారు అని అన్నాడు. కాగా, గత కొన్ని సంవత్సరాలు స్థిరంగా ఆడుతున్న న్యూజిలాండ్‌ జట్టు రెండో స్థానంలో నిలిచింది.