గోనె సంచుల్లో రూ.10 కోట్లు..తమిళనాడులో భారీగా పట్టుబడ్డ నగదు..

SMTV Desk 2019-04-01 16:53:13  MOney seized

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబానికి సన్నిహితుడు, డీఎంకే కోశాధికారి దురై మురుగన్ ఆస్తులపై ఆదాయ‌పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. వెల్లూరు జిల్లాలోని ఆయన నివాసంతోపాటు ఆయనకు సంబంధించిన ఓ సిమెంటు గోదాములో సోదాలు నిర్వహించారు.

దీంతో ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదుకు సరైన లెక్కలు చూపించక పోవడంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిమెంట్ గోదాములోని కార్టన్లు, గన్నీ బ్యాగుల్లో దాచిపెట్టిన డబ్బులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఆ డబ్బు దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని, వెల్లూరు నుంచి పోటీ చేస్తున్న దురై మురుగన్ కుమారుడు.. ఓటర్లకు పంపిణీ చేయడానికి ఈ డబ్బును సిద్ధం చేశారని అధికారులు భావిస్తున్నారు. రాత్రివేళ సిమెంట్ గోదాముపై దాడి చేసి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. ఎలాంటి వారెంట్లు లేకుండా సోదాలు ఎలా చేస్తారనని, ఇదంతా రాజకీయ కుట్ర అని పేర్కొంటున్నారు.