రిషబ్ పంత్ ఫిక్సింగ్‌ : బీసీసీఐ కామెంట్స్

SMTV Desk 2019-04-01 16:12:18  delhi capitals, ipl 2018, rishab pant, match fixing, bcci

ఏప్రిల్, 1: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌‌లో ఢిల్లీ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప స్ట్రైకింగ్‌లో ఉండగా.. ఢిల్లీ స్పిన్నర్ సందీప్ బంతి విసరకముందే.. వికెట్ల వెనుక నుంచి రిషబ్ పంత్ ‘ఇప్పుడు ఫోర్ వెళ్తుంది’ అని ముందుగానే చెప్పేశాడు. ఈ మాటలు స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డవగా.. అతను చెప్పినట్లు ఆ బంతిని రాబిన్ ఉతప్ప బౌండరీకి తరలించాడు. దీంతో.. బౌలర్ బంతి విసరక ముందే ‘ఫోర్’ గురించి రిషబ్ పంత్ ఎలా చెప్పగలిగాడు..? మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఓ వీడియోని షేర్ చేస్తూ అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు మళ్లీ తెరపైకి రావడంతో.. బీసీసీఐ వేగంగా స్పందించింది. ‘రిషబ్ పంత్‌ అంతకముందు ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్‌‌కి ఆఫ్‌సైడ్ ఫీల్డర్లను పెంచమని చెప్పాడు. అలా అయితేనే ఆఫ్‌సైడ్ బౌండరీలని నిలువరించగమని అతను సూచించిన మాటలు ఎవరూ వినలేదు’ అని బీసీసీఐ వివరణ ఇచ్చింది.