సుప్రీం కోర్టులోకి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదం

SMTV Desk 2019-04-01 16:01:56  ram gopal varma, lakshmis ntr, ntr, producer rakesh reddy, supreme court

హైదరాబాద్, ఏప్రిల్ 1: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా ఈ మధ్యే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను నిలిపివేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయంచారు. చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సినిమా ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఏపీలో విడుదలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.