గురువుకే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోహన్ బాబు!

SMTV Desk 2019-04-01 15:08:55  mohan babu, budda venkanna, government vip, tdp, chandrababu, ysrcp, ys jagan mohan reddy

అమరావతి, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ...మోహన్‌బాబు రంగులు మారే ఊసరవెల్లిలా ఎవరు ప్యాకేజీ ఇస్తు వారి గురించి మాట్లాడతారని ఆరోపించారు. చంద్రబాబుపై కావాలనే బురదజల్లుతున్నడాని మోహన్‌ బాబుకి ఎంత పారితోషికం అందిందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాదు పారితోషికం ఇవ్వందే మోహన్‌ బాబు ఏమీ మాట్లాడరని సినీ పరిశ్రమలో ఆయకున్న పేరని విమర్శంచారు. గురువు దాసరికే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోహన్ బాబు అని విమర్శించారు. మోహన్ బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతితో స్టేట్‌మెంట్ ఇప్పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పించిన ఎన్టీఆర్‌నే మోసం చేశారని, మేజర్ చంద్రకాంత్ సినిమాకు పారితోషికం ఎగ్గొట్టారని విమర్శించారు. జగన్‌కు పెయిడ్ వర్కర్‌గా మారి చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు.