బ్యాంకులకు ఏప్రిల్ సెలవులు

SMTV Desk 2019-04-01 15:01:00  bank, april holidays, banks holidays

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అతిగా బిజినెస్, నగదు వ్యవహారాలు న‌డిపే వారు బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి తరుచూ చేస్తూ ఉంటారు. అయితే ఏప్రిల్ నెల‌లో వచ్చే బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు, నాలుగో శనివారాలైన ఏప్రిల్ 13, 27 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే ఏప్రిల్ నెల‌లో వ‌చ్చే నాలుగు ఆదివారాలు 7, 14, 21, 28 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు. వీటికి అదనంగా ఏప్రిల్ 5న (శుక్రవారం) బాబు జగ్జివన్ రామ్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న (శనివారం) బ్యాంకులు ఉండవు. ఇక ఏప్రిల్ 19న (శుక్రవారం) గుడ్‌ఫ్రైడే సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అయితే నెట్ బ్యాంకింగ్ చేసేవారికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా సాగుతాయి. ఆయా బ్యాంక్ సెల‌వు రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.