రాహుల్ ప్రధాని అయితేనే!

SMTV Desk 2019-03-31 20:33:06  congress party, loksabha elections, indian prime minister, madhyapradesh high court

న్యూఢిల్లీ, మార్చ్ 31: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విజయం సాధిస్తే దేశంలోని నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ భద్రత పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే ఈ పథకం ఇంకా అమలులోకి రానే లేదు కాని దీనిపై గట్టి నమ్మకంతో ప్రజలు అనేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. భోపాల్‌ కు చెందిన ఆనంద్‌ అనే వ్యక్తికి 2006 లో దీప్‌ మాలా అనే మహిళతో వివహం అయింది. అయితే పెళ్లయిన కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య అబిప్రాయబేదాలు కవచ్చాయి. దీంతో ఇద్దరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కేసును కవిచారించిన కోర్టు భార్యకు నెలకు రూ.3 వేలు , కుమార్తె ఖర్చులకు నెలకు రూ.1500 బొప్పున చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఆనంద్‌ స్పందిస్తూ. ప్రస్తుతం తన దగ్గర అంత సొమ్ము లేదని వాపోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భద్రత పథకం కింద నెలకురూ. 6.000 ఇస్తామని చెప్పారనీ, దాని నుంచి ఈ భరణాన్ని చెల్లిస్తానని చెప్పాడు. తన బ్యాంకు ఖాతా నుంచి ఈ సొమ్ము నేరుగా భార్యాపిల్లల ఖాతాల్లోకి పడేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 29కి వాయిదా వేసింది. న్యాయ పథకం ద్వారా 25 కోట్ల మంది ప్రజలు లేదా ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.