కొత్త రూ.20 నోటు లక్షణాలు!

SMTV Desk 2019-03-31 18:56:50  indian prime minister, narendra modi, reserve bank of india, new currency notes

ముంబై, మార్చ్ 31: నల్ల ధనాన్ని అరికట్టేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.వెయ్యినోట్లను రద్దు చేసి తర్వాత కొత్త రూ.2వేల నోటు, రూ.500నోటును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రూ.200, రూ.100, రూ.50, రూ.10నోట్లను కొత్తగా తీసుకువచ్చింది. ఇప్పటివరకు కేవలం రూ.20నోటును మాత్రమే సరికొత్తగా తీసుకురాలేదు. కొత్తగా రానున్న రూ.20 నోటు ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌తో వచ్చిన నోట్లను పరిశీలిస్తే కొన్ని సాధారణ లక్షనాలు కలిగి ఉన్నాయని, కాబట్టి రూ.2వేల నోటు, రూ.500నోట్లకు అదేరీతిలో రూ.20 నోటు రావొచ్చని భావిస్తున్నారు. ముఖ భాగంలో డినామినేషనల్‌ న్యూమరల్‌తో పాటు లాటెంట్‌ ఇమేజ్‌, దేవనాగిరి లిపిలో డినామినేషన్‌ గణాంకాలు, మహాత్మాగాంధీ చిత్రం దిశ, సంబంధిత స్థానం మార్పు, గ్యారంటీ క్లాజ్‌, గవర్నర్‌ సంతకం, ప్రామిస్‌క్లాజ్‌తో, కుడివైపున ఆర్‌బిఐ చిహ్నం, పోట్రెయిట్‌, ఎలక్ట్రోటైప్‌ వాటర్‌ మార్క్స్‌, పైన ఎడమవైపులో, కింద కుడివైపున న్యూమరల్‌ నంబర్‌ ప్యానెల్‌ చిన్న సైజ్‌ నుంచి పెద్దగా, రూపాయి గుర్తుతో డినామినేషనల్‌ నంబర్‌, కుడివైపున అశోక స్తంభం ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. వెనకవైపు ఎడమ వైపున నోట్‌ ప్రింట్‌ చేసిన సంవత్సరం, స్వచ్ఛ భారత్‌ స్లోగన్‌ లోగో, స్లోగన్‌ మధ్యలో లాంగ్వేజ్‌ ప్యానెల్‌, కుడివైపున దేవనాగరి లిపిలో కూడా నోటు మొత్తం విలువను ముద్రిస్తున్నారు.