SRH : డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో న్యూ రికార్డ్

SMTV Desk 2019-03-31 17:47:36  srh, ipl 2019, david warner, J Bairstow, Hyderabad, Gambhir, C Lynn, KKR, SRH, RCB, GL, Gayle, Dilshan, PWI, Tendulkar, Smith, RR

హైదరాబాద్, మార్చ్ 31: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉప్పల్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్స్ గా డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో క్రీజులోకి అడుగుపెట్టారు. అయితే మొయిన్ అలీ బౌలింగ్ లో పరుగులు తీయడం స్టార్ట్ చేసిన జానీ బెయిర్‌స్టో సెంచరీ చేసి 114(56)వద్ద అవుటయ్యాడు. ఇక వీరిద్దరి భాగస్వామ్య పరుగులు 185. అయితే ఐపీఎల్ అన్ని సీజన్లో ఓపెనింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్స్ గా ఇప్పుడు వీరిద్దరు రికార్డు సృష్టించారు. ఇప్పుడు మొదటి స్థానంలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో (SRH)185 పరుగుల వద్ద ఉండగా...గంభీర్, సి లిన్ KKR v GL మధ్య 2017 లో జరిగిన మ్యాచ్ లో వీరి 184 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో గేల్, టి, దిలషణ్ RCB v PWI మధ్య 2013 లో జరిగిన మ్యాచ్ లో 167 చేశారు. సచిన టెండూల్కర్, డి స్మిత్ 2012 లో జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి 163 చేసి నాలుగో స్థానంలో ఉన్నారు. అంతేకాక ఈ మ్యాచ్ లో వీరిద్దరూ మరో సంచలన రికార్డు కూడా సృష్టించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు వీరిద్దరు ఓపెనర్స్ గా వచ్చిన మూడు మ్యాచ్ లో భాగస్వామ్య పరుగులు శతకం దాటుతూ వచ్చాయి.