సరిహద్దులో ఎత్తైన పాక్ జాతీయ పతాకం

SMTV Desk 2017-08-14 12:50:11  Pakistan independence,Pak army staff general, Tallest flag, qamar javed bajwa

పాకిస్థాన్, ఆగస్ట్ 14: నేడు పాకిస్థాన్ 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ స్టాఫ్ జ‌న‌ర‌ల్‌ అధినేత ఖ‌మ‌ర్ జావేద్ బాజ్వా వాఘా సరిహద్దులో 400 అడుగుల ఎత్తున్న స్తంభంపై జాతీయ జెండాని ఎగరేశారు. 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు కలిగిన ఈ పతాకం దక్షిణాసియాలో అతి ఎత్తైన పతాకంగా నిలిచింది. కాగా, ఈ అతి ఎత్తైన పతాకం ప్రపంచంలోని ఎత్తైన పతాకాల్లో ఎనిమిదో స్థానం సొంతం చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో బీజేపీ నేత అనిల్ జోషి ఆవిష్కరించిన భార‌త జాతీయ పతాకం కంటే ఇది 40 అడుగుల ఎత్తు ఎక్కువగా ఉంది. అయితే, తీవ్ర గాలి దుమారం కారణంగా ఈ పతాకం కింద పడిన విషయం తెలిసిందే.